అమెరికా సందర్శించే బంధువుల కోసం విజిటర్స్ ఇన్సూరెన్స్

ప్రతీ సంవత్సరం అమెరికాలో నివసించే వారు భారత దేశంలో ఉన్న తమ బంధువులను ఆహ్వానిస్తుంటారు. ఇలా అమెరికా సందర్శించే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఇలా వచ్చిన వారు ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులతో సమయం  గడపడానికో, లేక ఇక్కడ ఉన్న ఎన్నో పర్యాటక ప్రదేశాలు చూడడానికో వస్తుంటారు. అమెరికా సందర్శించే బంధువులకు విజిటర్స్ ఇన్సూరెన్స్ కొనుగోలు గురించి ఆలోచించటం ఎంతో ముఖ్యం. దీనినే ట్రావెల్ ఇన్సూరెన్స్ లేదా ట్రావెల్ మెడికల్  ఇన్సూరెన్స్ అని కూడా అంటారు. ఎందుకంటే విదేశాలకు వెళ్ళినప్పుడు ఈ ఇన్సూరెన్స్ తో మెడికల్ కవరేజ్ ఉంటుంది. అమెరికాకు వచ్చే తమ తల్లితండ్రులకు లేదా అత్తమామలకు వీసా మరియు ప్రయాణ ఏర్పాట్లు చేసే  సమయంలో వారికి విజిటర్స్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయటం అవసరమా లేదా  అని చాలామంది ఆలోచిస్తుంటారు. ఒకవేళ కొనాలంటే ఎక్కడ కొనుగోలు చేయాలి, ఏది మంచి పాలసీ అనే ప్రశ్నలు సహజం.

మీ బంధువులకు విజిటర్స్ ఇన్సూరెన్స్ కొనుగోలు అవసరమా ?

అన్ని దేశాల కంటే అమెరికాలో వైద్య చికిత్స అత్యంత ఖర్చు తో కూడుకున్న వ్యవహారం. ఒక చిన్న ఆరోగ్య సమస్య కు కూడా వేల డాలర్లలో ఖర్చు అవచ్చు. అందుకే విజిటర్స్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయటం ఎంతో అవసరం మరియు తెలివైన నిర్ణయం.

మరిన్ని వివరాలు

విజిటర్స్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు ఎక్కడ చేయాలి ? అమెరికా లోనా  లేక  స్వదేశంలోనా ?

విజిటర్స్ ఇన్సూరెన్స్ మీరు అమెరికాలో కొనవచ్చు లేదా స్వదేశంలో ఉన్న కొన్ని కంపెనీల ద్వారా అయినా కొనవచ్చు.  ఇలా స్వదేశం లో లభ్యమయ్యే కొన్ని పాలసీలు చవకగా దొరకవచ్చు కానీ విదేశాల్లో వాటికి గుర్తింపు తక్కువ. ఇలాంటి పాలసీలలో ప్రత్యక్ష బిల్లింగ్ లాంటి సదుపాయం ఉండదు. పైగా ఇవి కొంత నిర్దిష్ట మొత్తం వరకే కవర్ చేస్తాయి. అంటే మీరు చికిత్స కొరకు మొదట మీ చేతి నుండి చెల్లించి, స్వదేశం వెళ్లిన తరవాత క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. చెల్లించాల్సిన మొత్తం చిన్నదైతే పర్వాలేదు కానీ అది ఏ ముప్పై నలభై వేల డాలర్లయితే ఎవరికైనా కష్టమే. సంక్షిప్తంగా చెప్పాలంటే, విజిటర్స్ ఇన్సూరెన్స్ అనేది స్వదేశం నుండి కొనుగోలు చేయటం ఉత్తమం కాదు.

ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు – అమెరికా మరియు భారత కంపెనీల తులనాత్మక అంచనా

మీరు విమాన టిక్కెట్లు కొనుగోలు చేసేటప్పుడు ఎంతో మంది ట్రావెల్ ఏజెంట్లు మీకు సరిగ్గా ఉపయోగపడని ఇన్సూరెన్స్ ప్లాన్లను  అమ్మటానికి ప్రయత్నిస్తారు. విజిటర్స్ ఇన్సూరెన్స్ లో మన అవసరాన్ని బట్టి ఎన్నో రకాల ప్లాన్లు లభ్యమవుతాయి. వీటి మీద సరైన అవగాహన, అనుభవం  ట్రావెల్ ఏజెంట్లకు ఉండదు. అందుకే మీకు వారు సరైన ఇన్సూరెన్స్ ప్లాన్ ని సూచించలేరు.

పై కారణాల వలన, ఇన్సూబై లాంటి పేరు పొందిన మరియు అనుభవజ్ఞులైన ఇన్సూరెన్స్ ఏజెన్సీ ద్వారా కొనొగోలు చేయటం మంచిది. విజిటర్స్ ఇన్సూరెన్స్ వ్యాపారం లో ఇన్సూబై రెండు దశాబ్దాలు గా ఉన్న ప్రముఖమైన కంపెనీ. ఇన్సూబై.కామ్ వెబ్సైటు లో మీరు పలు రకాల ప్లాన్లను పోల్చి సరైన పాలసీ ని వెంటనే ఆన్లైన్ లోనే కొనవచ్చు. ఇన్సూబై వారిని మీరు +1 (866) INSUBUY, లేక  +1 (972) 985-4400 ఫోన్ నెంబర్ల ద్వారా లేదా  +1 (972) 795-1123 వాట్సాప్ నెంబర్ ద్వారా వారంలో ఏరోజైనా సంప్రదించవచ్చు. ఇన్సూబైలో పని చేసే లైసెన్సుడ్ ఇన్సూరెన్స్ నిపుణులు మీకు సహాయపడతారు. అన్ని ప్లాన్లు ఒకేలా ఉంటాయని అనుకోవద్దు. కొనే ముందు పూర్తి పరిశోధన చేసి సరైన పాలసీని తీసుకోవాలి.

విజిటర్స్ ఇన్సూరెన్స్ రకాలు

విజిటర్స్ ఇన్సూరెన్సులో ఎన్నో రకాల ప్లాన్లు ఉన్నా ముఖ్యంగా వీటిని రెండు రకాలుగా  విభజించవచ్చు. స్థిర (ఫిక్స్డ్)  కవరేజ్ ప్లాన్లు  మరియు సమగ్ర (కాంప్రహెన్సివ్) కవరేజ్  ప్లాన్లు.

స్థిర కవరేజ్ :

ఇలాంటి ప్లాన్లు ప్రతి చికిత్సకి ఒక స్థిర మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తాయి. మిగతా డబ్బు మన చేతినుండి కట్టుకోవాలి. ఈ ప్లాన్లు చవకగా లభిస్తాయి కానీ ఇవి చాలా మంది చిన్న అవసరాలకు కూడా సరిపోవు.

భారతదేశం మరియు ఇతర దేశాల్లో కూడా చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు ఇలాంటి ప్లాన్లనే అమ్ముతాయి. వాటిలో సమగ్ర కావేరజ్ ఉందని చెప్పినా వాటి పరిధులు వాటికి ఉన్నాయి. అందువల్ల ఇవి స్థిర కవరేజ్ ప్లాన్లు  మాత్రమే. వీటి ఖరీదు సమగ్ర కవరేజ్ ప్లాన్ల కన్నా రెండు మూడు రెట్లు తక్కువ. ఇవి నిజంగా అందరి ఇన్సూరెన్స్ అవసరాలకి సరిపోయినట్టైతే సమగ్ర కవరేజ్ ప్లాన్లనేవి ఉండేవి కావు.

కొన్ని ప్రముఖమైన స్థిర కవరేజ్ ప్లాన్లు:

సమగ్ర  కవరేజ్  :

ఇవి స్థిర కవరేజ్ ప్లాన్ల కన్నా కొంత ఎక్కువ ఖరీదు ఉన్నా అవి అందించే లాభాల తో పోలిస్తే , వాటి ఖరీదు  తక్కువనే చెప్పాలి.

సాధారణంగా ఈ ప్లాన్లు డిడక్టబుల్ ఎమౌంట్ చెల్లించిన  తరవాత  మిగిలిన దాని  మీద  ఒక నిర్దిష్ట మొత్తం వరకు ( ఉదాహరణకు 5000 డాలర్లు వరకు ), 75%, 80% లేదా  90% చెల్లిస్తాయి, ఆ  పైన  పాలసీ  గరిష్ట  మొత్తం వరకు  100% చెల్లిస్తాయి. చాల  ప్లాన్లు  డిడక్టబుల్ చెల్లించిన  తరువాత  పాలసీ  గరిష్ట మొత్తం వరకు  100% చెల్లిస్తాయి.

ఎన్నో  సమగ్ర  కవరేజ్ ప్లాన్లు  పిపిఓ   (ప్రిఫర్డ్  ప్రొవైడర్  ఆర్గనైజషన్ ) నెట్వర్క్  అనుబంధం  ద్వారా  ప్రత్యక్ష  బిల్లింగ్  సదుపాయాన్ని  కలిపిస్తాయి  కాబట్టి  చాలా  సందర్భాల్లో మీరు హాస్పిటల్ లేదా డాక్టర్ కు  డిస్కౌంటెడ్ ఫీజు  మాత్రమే  చెల్లిస్తారు.

కొన్ని  ప్రముఖమైన  సమగ్ర  కవరేజ్ ప్లాన్లు :

ముందే  ఉన్న  ఆరోగ్య  సమస్యలు:

సందర్శకులలో చాలా మంది వృద్ధులకు ముందే  కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ఇలాంటి ఆరోగ్య సమస్యలకు విజిటర్స్ ఇన్సూరెన్స్ లో కవర్ అవుతాయా లేదా అనే ప్రశ్న ఎంతో మందికి ఉంది. ఇలాంటి సమస్యలతో ఉన్నవారు నిత్యం తరచూ గా తీసుకొనే చికిత్సలు కానీ ముందస్తు ఆరోగ్య పరీక్షలు కానీ విజిటర్స్ ఇన్సూరెన్స్ లో కవర్ అవ్వవు. కానీ ఎన్నో సమగ్ర కవరేజ్ ప్లాన్లలో ముందుండే అనారోగ్యం వల్ల అకస్మాత్తు  గా  వచ్చే  (ఎక్యూట్ ఆన్సెట్) అస్వస్తతలని కవర్  చేస్తాయి.

ముందస్తు అనారోగ్య సమస్యల కవరేజ్ కొరకు ఉత్తమమైన విజిటర్స్ ఇన్సూరెన్స్ ప్లాన్లు

విజిటర్స్ ఇన్సూరెన్స్ కొనుగోలు  చేసే ప్రక్రియ

విజిటర్స్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసే ప్రక్రియ చాలా సులభం. ఇన్సూబై.కామ్ వెబ్సైటు లో మీకు సంబంధించిన కొన్ని వివరాలు అంటే మీ ప్రయాణ తేదీలు, మీ వయసు, గరిష్ట పాలసీ మొత్తం మొదలైనవి నింపి దానికి తగ్గ పలు ప్లాన్లను చూడవచ్చు. ప్లాన్లకు సంబంధించిన అన్ని వివరాలు పరిశోధన చేసి ఆన్లైన్ లోనే ఐదు నిమిషాలలో పాలసీని కొనవచ్చు. వెంటనే మీ ఐడీ కార్డు మరియు పాలసీ డాక్యూమెంట్లు మీ ఇమెయిల్ కు పంపబడతాయి.

అమెరికాకు వచ్చిన తరవాత అయినా ప్రయాణానికి ముందైనా మీరు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. కానీ ప్రయాణానికి ముందే తీసుకోవటం మేలైనది. ఆలా తీసుకుంటే మీకు ప్రయాణ సమయం లో కూడా కవరేజ్ ఉంటుంది. అంతే కాకా అమెరికాకు వచ్చిన తరవాత మీరు తీసుకోవాలనుకుంటే కొన్ని నింబంధనలు ఉంటాయి. ఉదాహరణకు మీరు మేరీల్యాండ్ స్టేట్ వాస్తవ్యులు అయితే చాలా విజిటర్స్ ఇన్సూరెన్స్ ప్లాన్లను  మీరు కొనలేరు.

అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే అమెరికాకు వచ్చిన తరవాత అందరూ కుటుంబం తో లేక విహారం లో బిజీ అయిపోయి అసలు ఇన్సూరెన్స్ గురించే  మర్చిపోయే అవకాశం ఉంది.వచ్చిన వారిలో ఎవరికైనా ఏదైనా అనారోగ్యం వస్తే కానీ ఇన్సూరెన్స్ గుర్తుకు రాదు. ఆలా జరిగిన తరవాత మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే ఆలస్యం చేసినట్టే. పైగా ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా అనారోగ్యం వచ్చిన తరువాత పాలసీ కొంటే అప్పటికే అయిన ఖర్చు కానీ మీకు తెలిసి అవబోయే ఖర్చు కానీ కవర్ చేయదు. మీరు వేరే వెబ్సైట్లలో “అనారోగ్యం వచ్చిన తరవాత కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు” అని చదివి ఉంటె వాటిని అసలు నమ్మ వద్దు. అవి పచ్చి అబద్ధాలు. ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా అలాంటి నష్టాన్ని భరించదు.

వేరుగా లేక కలిపి కొనుగోలు చేయుట

ఒకవేళ మీ బంధువులు ఇద్దరు లేక ఎక్కువ మంది అమెరికాకు వస్తుంటే వారందరికీ కలిపి పాలసీ తీసుకోవచ్చు. ఉదాహరణకు మీ తల్లితండ్రులు ఇద్దరూ వస్తుంటే వారికి కలిపి ఒక పాలసీ తీసుకోవచ్చు లేక వేరు వేరుగా కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా చెల్లించాల్సిన ప్రీమియం మొత్తం ఒకటే ఉంటుంది. కానీ విడిగా తీసుకోవటం వల్ల ఒక్కరికే ఇన్సూరెన్స్ రద్దు చేయాలన్నా లేక పొడిగించాలన్నా ఆ ప్రక్రియ సులభం అవుతుంది. చాలా సందర్భాల్లో తల్లితండ్రుల్లో ఒకరు ఎక్కువ కాలం అమెరికాలో ఉండాలనుకుంటే ఇంకొకరు పనుల వల్లనో లేక తోచకనో భారతదేశం త్వరగా వెళ్లిపోవాలనుకుంటారు.

English    ગુજરાતી     हिंदी     मराठी     தமிழ்    العربية

How useful was this post?

Click on a star to rate it!

We are sorry that this post was not useful for you!

Let us improve this post!

Tell us how we can improve this post?

RELATED TOPICS

For visitors, travel, student and other international travel medical insurance.

Visit insubuy.com or call +1 (866) INSUBUY or +1 (972) 985-4400